ఆలమూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ ర్యాలీ

54చూసినవారు
ఆలమూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ ర్యాలీ
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆలమూరులో సోమవారం పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఆలమూరు ఎ ఎస్ఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొని ముందుగా అమరులైన పోలీసులకు నివాళు లర్పించారు. అనంతరం పోలీసుస్టేషన్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అమరులైన పోలీసులకు జోహార్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్