బాణసంచా తయారీకి లైసెన్సులు తప్పనిసరి
లైసెన్సులు లేకుండా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ సుమంత్ హెచ్చరించారు. గురువారం మండలంలోని తొస్సిపూడి గ్రామాల్లో బాణసంచా తయారీ కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పరిమితులకు మించి బాణసంచా తయారుచేస్తే సీజ్ చేస్తామన్నారు. ప్రమాదాలు జరగకుండా అగ్ని నిరోధక యంత్రాలు, నీటి నిల్వలు అందుబాటులో వుంచుకోవాలన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తయారీదారులకు సూచించారు.