ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌ను సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా ఖండించాలని డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. 'ఏ సినీ స్టార్ అయినా, పొలిటికల్ స్టార్ అయినా పాపులర్ కావడం వారి తప్పా? అలాగైతే క్షణం క్షణం షూటింగ్ సమయంలో శ్రీదేవిని చూసేందుకు వచ్చిన వేలాది జనంలో ముగ్గురు చనిపోయారు. మరి తెలంగాణ పోలీసులు ఇప్పుడు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్ట్ చేస్తారా' అని ఆయన ప్రశ్నించారు.