ఆటో - కారు ఢీ ముగ్గురికి గాయాలు
గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ జాతీయ రహదారిపై ఆదిత్య ఆసుపత్రి జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. జగ్గంపేట వెళుతున్న ఆటోను హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళుతున్న కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మంగిన వీరబాబు, కొల్లి వెంకటరావు, కారులో ప్రయాణిస్తున్న బల్లెం నవీన్ కుమార్ గాయల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.