Nov 07, 2024, 17:11 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర: ఊక చెట్టు వాగుపై నిర్మించిన వంతెన ప్రారంభం
Nov 07, 2024, 17:11 IST
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రం నుండి కురుమూర్తి వెళ్లేందుకు ఊక చెట్టు వాగుపై నిర్మించిన భారీ వంతెనను గురువారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కురుమూర్తి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.