Nov 03, 2024, 17:11 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
మహబూబ్ నగర్: కరాటే టోర్నీలో కింగ్ షోటోకాన్ విద్యార్థుల ప్రతిభ
Nov 03, 2024, 17:11 IST
ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లార్డ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 2 న ఇంటర్ కళాశాల కరాటే టోర్నమెంట్ నిర్వహించారు. జిల్లా కేంద్రానికి చెందిన కింగ్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు సత్తా చాటి పతకాలు సాధించినట్లు ఆదివారం జహంగీర్ పాషా ఖాద్రీ తెలిపారు. ఈ టోర్నమెంట్లో క్లబ్ విద్యార్థి మొహమ్మద్ ఉజేష్ షరీఫ్ కట్టాలో మెరుగైన ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.