Nov 30, 2024, 02:11 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు
Nov 30, 2024, 02:11 IST
వాహనదారులు నిబంధనలు పాటించాలని వనపర్తి పట్టణ ట్రాఫిక్ ఏఎస్ఐ నిరంజన్ అన్నారు. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు శుక్రవారం వనపర్తి కేంద్రంలోని పలు సెంటర్లలో వాహనాల తనిఖీ నిర్వహించారు. హెల్మెట్, వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు జరిమానా విధించారు. త్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.