Mar 31, 2025, 16:03 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: కులమతాలకు అతీతంగా రంజాన్ కాంగ్రెస్ నాయకులు
Mar 31, 2025, 16:03 IST
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు సోమవారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్, పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ మాట్లాడుతూ. కులమతాలకు అతీతంగా రంజాన్ పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.