బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండలో వర్షం పడే ఛాన్స్ ఉంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఎల్లుండి కరీంగనర్, పెద్దపల్లి, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరితో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.