జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వీట్లు పండ్లు పంపిణీ
పి. ఎం పోషణ్ కార్యక్రమంలో భాగంగా జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ హై స్కూల్ లో సోమవారం విద్యార్థులకు స్వీట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్. ఎం ఆర్. రామకృష్ణ మాట్లాడుతూ రోజువారి మెనూతో పాటు దాతలు సహకారంతో విద్యార్థులకు స్వీట్లు పండ్లు అందించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో ఎం. జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.