రాజమండ్రి: గోదావరి తీరంలో కార్తీక శోభ
కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో రాజమండ్రిలోని గోదావరి తీరంలో కార్తీక శోభ సంతరించుకుంది. సోమవారం వేకువజాము నుంచి గోదావరి పుష్కర్ ఘాట్‌కు వేలాది మంది తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అక్కడే పూజలు చేసి నదిలో దీపాలు వదిలి పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.