రాజమండ్రి: కూటమి ప్రభుత్వంలో విద్యకు ప్రాధాన్యత- ఎమ్మెల్యే

77చూసినవారు
కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి తక్కువ ఖర్చుతో విద్యను అందించాలనే లక్ష్యంతో నగరంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ చార్జ్ అను శ్రీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్