రామచంద్రపురం మండల వ్యాప్తంగా గ్రామసభలు
రామచంద్రపురం మండల వ్యాప్తంగా శుక్రవారం గ్రామ సభలను సర్పంచుల అధ్యక్షతన అధికారులు నిర్వహించారు. ఈ మేరకు మండలంలోని కందులపాలెం గ్రామంలో పెంకే కృష్ణవేణి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అభివృద్ధి పనులు గురించి ప్రజలతో చర్చించారు. గ్రామసభ ద్వారా ప్రజలు స్థానిక సమస్యలను సమావేశంలో చర్చించారు.