జనవరి 3న లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు
ఏపీలో ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించనుంది. ఒక జిల్లాలో సీఎం చంద్రబాబు పాల్గొని లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించి, వారితో మాట్లాడనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇప్పటివరకు లక్ష గృహ నిర్మాణాలను పూర్తి చేసింది. వివిధ దశల్లో ఉన్న మిగతా 6.40 లక్షల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం ఇటీవలే అనుమతిచ్చింది.