రుణమాఫీ ఘనత మన్మోహన్‌దే

72చూసినవారు
రుణమాఫీ ఘనత మన్మోహన్‌దే
రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్‌కే దక్కుతుంది. UPA ప్రభుత్వం 2008లో దేశంలో 3 కోట్ల మంది రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసింది. ఈ సాహసోపేత నిర్ణయం కారణంగానే 2009లో యూపీయే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికల్లో గెలిచాయి. మన్మోహన్‌ హయాంలోనే విదర్భ, బుందేలఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్