ఒక రోజు ముందే పింఛన్

61చూసినవారు
ఒక రోజు ముందే పింఛన్
AP: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి ఒకటో తేదీకి ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. 63.75 లక్షల మందికి పింఛన్ల పంపిణీకి రూ.2,717.31 కోట్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్