మచిలీపట్నం: రామలింగేశ్వరుని దర్శించుకున్న మంత్రి
మచిలీపట్నంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం చివరి వారం కావడంతో స్వామివారికి రాష్ట్ర గనుల భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలతో స్వామివారికి కొల్లు రవీంద్ర తనయుడు కొల్లు పునీత్ అభిషేకం నిర్వహించారు. స్వామివారికి అభిషేకం అనంతరం కొల్లు రవీంద్రను ఆలయ ప్రధాన అర్చకుడు భాస్కర శర్మ శేషవస్త్రాలతో సన్మానించారు.