కృష్ణా జిల్లాలో శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి మరియు చట్టానికి వ్యతిరేక కార్యకలాపాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధర రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం కృష్ణా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసించే చెడు నడత కలిగిన రౌడీలు, డీసీలు, కేడి & సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ కు పోలీసులు కౌన్సిలింగ్కు నిర్వహించారు. సత్ప్రవర్తన కలిగి సమాజంలో జీవించాలని సూచించారు.