మచిలీపట్నం : ప్రైవేట్ వాహనాలకు నిలయంగా కలెక్టరేట్ ప్రాంగణం
ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కు మచిలీపట్నంలోని కలెక్టరేట్ అడ్డాగా మారింది. దీంతో తమ వాహనాలు ఎక్కడ పార్క్ చేయాలో తెలియక కలెక్టరేట్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోజులు, వారాలు తరబడి కలెక్టరేట్ లోని పార్కింగ్ ప్రదేశంలోనే ప్రైవేట్ వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో పార్కింగ్ కు జాగా లేక తమ వాహనాలను కార్యాలయం బయటే ఉద్యోగులు పార్క్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.