భౌగోళిక సూచిక (జిఐ) ఎంపికతో నరసాపురం లేస్ కు అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రత్యేక ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజి, బ్రాండింగ్ ప్రమోషన్ లక్ష్యంగా ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. జౌళి పరిశ్రమలో చేతితో నేసిన వస్త్రాలు దేశంలో భౌగోళిక సూచిక నమోదిత ఉత్పత్తుల పట్టికలో అగ్రగామిగా ఉన్నాయన్నారు.