గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని వెనుక నుంచి
టాటా ఏస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించగా.. క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.