హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు సందర్శకులు పోటెత్తారు. సంక్రాంతి వరుస సెలవులు రావడంతో నుమాయిష్‌ను రోజు దాదాపు 60 వేల మంది సందర్శించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ కొనసాగనుంది. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.