జమ్మూకశ్మీర్‌లో ఓ అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడి 12 మంది చిన్నారులు మృతిచెందారు. తాజాగా మరో చిన్నారి కూడా ఈ వ్యాధి కారణంగా మరణించడంతో మృతుల సంఖ్య 13కి పెరిగింది. డిసెంబరు 24 నుంచి మృత్యుఘంటికలు మోగిస్తున్న ఈ వ్యాధితో ఒక్క రాజౌరీ జిల్లాలోని బధాల్ గ్రామంలోనే అత్యధికంగా చిన్నారులు మరణించారు. అధిక జ్వరం, తీవ్రంగా చెమటలు పట్టడం, వాంతులు, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోతుండడం ఈ వ్యాధి లక్షణాలు.