అనకాపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం

72చూసినవారు
అనకాపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం
అనకాపల్లి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లాకేంద్రానికి చెందిన పరవాడలో ఫార్మా ఘన వ్యర్థాల కేంద్రంలో మంటలు అంటుకున్నాయి. దీంతో చుట్టుపక్కల మొత్తం దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలను పారబోసి నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :