మహిళలు, రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం నిధుల జమ..!

594చూసినవారు
మహిళలు, రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం నిధుల జమ..!
ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నిధుల్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ. 1843 కోట్లు జమ చేశారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాల్లోకి రూ. 1236 కోట్లు విడుదల చేసారు. వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లను లబ్ధిదారుల అకౌంట్లలో డిపాజిట్ చేసారు. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమ అయింది. జగనన్న విద్య దీవెన పథకం కింద లబ్ధిదారులైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ కింద రూ.605 కోట్లు అకౌంట్లలోకి జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్