వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణ కోసం మంత్రి పదవి వేచి ఉందా? రాధా దశ తిరుగుతోందా? రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత రాధాకు తగిన స్థానం లభిస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. తాజాగా వంగవీటిని కలవడానికి వెళ్లిన మంత్రి లోకేశ్ ఆయన ఇంటి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రాధాకు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోటాలో ఒక సీటుని కేటాయించి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తోంది.