ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉచితంగా ఇసుక పంపిణీ

82చూసినవారు
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉచితంగా ఇసుక పంపిణీ
ఇసుక, గనుల పాలసీ-2019, మెరుగైన ఇసుక విధానం-2021లను రద్దుచేస్తూ మంత్రివర్గంలో తీర్మానించారు. ఉచితంగా ఇసుక అందజేసేందుకు ఉద్దేశించిన జీఓ 43కి ఆమోదం తెలిపింది. వినియోగదారుల నుంచి స్థానిక సంస్థల సీనరేజి, రవాణా రుసుము మాత్రమే వసూలుచేస్తారు. ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, పూడికతీత ద్వారా మరింతగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాస్థాయిలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్