స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

77చూసినవారు
స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
విద్యార్థుల డేటాను యూడైస్ ప్లస్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేసేలా డేటా నమోదు చేసి ఉండాలని డీఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, టీచర్లకు సూచించింది. వచ్చే నెల 6వ తేదీలోగా విద్యార్థుల డేటాను నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ డేటా ఆధారంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం, దుస్తువులు, పుస్తకాలు, స్కాలర్‌షిప్ వంటి వాటికి కేంద్రం బడ్జెట్ కేటాయించనుంది.

సంబంధిత పోస్ట్