AP: పీఏసీ ఎన్నికను వైసీపీ బాయ్‌కాట్ చేసింది. పీఏసీ చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ప్రతిపక్షానికే కేటాయిస్తున్నామని, అందుకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. అందుకే పీఏసీ ఎన్నికను బాయ్‌కాట్ చేశామన్నారు. అధికార పక్షం ఆ చైర్మన్ పదవి తీసుకుంటే ఏం న్యాయం జరుగుతుందని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.