గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, రామచంద్రరావు దంపతులు దాతృత్వాన్ని చాటుకున్నారు. గుంటూరుకి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని శృతి సింగ్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని కొన్ని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో మాధవి దంపతులు మానవతాదృక్పథంతో స్పందించి భ్రమరా ట్రస్ట్ ద్వారా ఆ విద్యార్థినికి ఐదేళ్ల ఫీజు చెల్లించడానికి ముందుకు వచ్చారు. ఆ విద్యార్థిని మాధవి దంపతులకు కృతజ్ఞతలు చెప్పారు.