
సత్తెనపల్లి: ఫీజు పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ఈనెల 5వ తేదీన విద్యార్థులకు అండగా జగనన్న తలపెట్టిన ఫీజుపోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ కోరారు. నకరికల్లు గ్రామంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి నాయకులతో ఆదివారం సమావేశమైయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నానన్నారు.