అద్దంకి: విద్యుత్ అధికారులతో సమావేశమైన మంత్రి గొట్టిపాటి

72చూసినవారు
అద్దంకి: విద్యుత్ అధికారులతో సమావేశమైన మంత్రి గొట్టిపాటి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆదివారం అద్దంకి నియోజకవర్గ విద్యుత్ అధికారులతో తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ల భూసేకరణ పనులను తెలుసుకుని, రెవెన్యూ సిబ్బందితో సమన్వయంతో భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్