పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బెల్లంకొండ మండలంలో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల అధికారులతో కలిసి పంట పొలాలను పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మంగళవారం పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో క్రోసూరు ఏడిఏ హనుమంతరావు, బెల్లంకొండ వ్యవసాయ శాఖ అధికారి కృష్ణయ్య, సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.