సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలింపు
బెల్లంకొండ మండల కేంద్రంలోని కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నమని టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ మస్తాన్ షరీఫ్ అన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయన్నారు. గుడారంలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలైన అంగన్వాడి ప్రాథమిక పాఠశాలలోకి తరలించారు. వర్షం తగ్గేవరకు ఇక్కడే ఉండాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన అన్నారు.