ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

63చూసినవారు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం
జగిత్యాల పట్టణ దేవిశ్రీ గార్డెన్స్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ పారిశుధ్య కార్మికుల కొరకు ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ ఎ. జ్యోతి లక్ష్మణ్, డీఎంహెచ్ఓ సమీయొద్దీన్, ఐఎంఎ అధ్యక్షుడు జి. హేమంత్, ప్రధాన కార్యదర్శి ఎ. శ్రీనివాస్, కోశాధికారి సుధీర్ కుమార్, కౌన్సిలర్ కె. నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్