గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోకి ద్విచక్ర వాహనాలు, ఆటోలను అనుమతించడం లేదని ఆదివారం రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి అని గేట్స్ సిబ్బందిని అడిగితే సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఆదేశాలు అనుసారం చేస్తున్నామని తెలిపారు. నడవలేని వారు, రోగులు గేటు వద్దనే దిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.