గుంటూరు: శానిటేషన్ విభాగాలను జనవరి లోపు ప్రక్షాళన చేస్తాం
ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాన్ని జనవరి లోపు ప్రక్షాళన చేస్తామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. గుంటూరు నగరంలోని కౌన్సిల్ సాధారణ సమావేశంలో భాగంగా శుక్రవారం కమిషనర్ మాట్లాడారు. కొందరు అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి ఒకే ప్రదేశంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడు తున్నారని కమిషనర్ తెలిపారు.