కారంపూడి: జాతీయ పశుగణ వార్షికోత్సవల పోస్టును ఆవిష్కరణ
కారంపూడి మండలంలో 21వ జాతీయ పశు గణన వారోత్సవాలను కారంపూడి ఇన్ చార్జ్ పశువైద్యాధికారి దిలీప్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ గంట శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ సరస్వతి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మాట్లాడుతూ ఈనెల నుంచి 2025 ఫిబ్రవరి వరకు పశువుల సర్వేను తమ సిబ్బంది చేపడతారన్నారు. తమ శాఖ సిబ్బంది సర్వే చేపట్టినప్పుడు రైతులు, ప్రజలు తమ పశువుల వివరాలను సంబంధిత యాప్ లో నమోదు చేసుకోవాలని కోరారు.