కారంపూడి: మీ సేవ కేంద్రంపై ఎమ్మార్వోకు ఫిర్యాదు
ఒప్పిచర్ల గ్రామానికి చెందిన మీసేవ కేంద్రాన్ని మండల కేంద్రమైన కారంపూడిలో నిర్వహించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంగులూరి అంజయ్య, చప్పిడి రాము, గోరంట్ల నాగేశ్వరావు శెట్టి శంకర్ కలిసి కారంపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మీసేవ కేంద్రాన్ని ఒప్పిచర్ల గ్రామంలోనే ఏర్పాటు చేయించాలని విన్నవించారు.