ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన
రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు రీడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కారంపూడి గ్రామంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు 'మీకు తెలుసా? ' అనే కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ కోమలి మాట్లాడుతూ. ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు.