నాదెండ్ల: ప్రవీణ్ నాయక్ కు సన్మానం
నాదెండ్ల మండలం చిరుమామిళ్లలోని ఆదర్శ పాఠశాల అగ్రికల్చర్ వొకేషనల్ ట్రైనర్ పి. ప్రవీణ్ నాయక్ ఉత్తమ అగ్రికల్చర్ వొకేషనల్ ట్రైనర్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని శనివారం ఘనంగా సత్కరించారు. కాగా పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీవాణి, పలువురు ఉపాధ్యాయులు ప్రవీణ్ నాయక్ ని అభినందించారు.