అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి: ఎమ్మెల్యే మేగేశన
అధికారులు జవాబుదారీతనంతో పని చేసి ప్రజల మన్నలను పొందాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. గురువారం పిట్టలవానిపాలెం ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ఎంపీపీ సీతారామరాజు అధ్యక్షత వహించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంపీడీవో సత్యనారాయణ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.