తాడేపల్లి: సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా
తాడేపల్లి మండలం సిమెంట్ ఫ్యాక్టరీ భూమిలో ఏసీసీ సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూ ఆధ్వర్యంలో ఆదివారం దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి కార్మికులు నిరసన తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు మాట్లాడుతూ 1993లో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆకస్మాత్తుగా లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు అంతా రోడ్డున పడ్డారని చెప్పారు. ఇప్పటికీ యాజమాన్యం దుర్మారంగా వ్యవహరిస్తోందని అన్నారు.