వేమూరు: అంబేద్కర్ విగ్రహానికి నివాళిలర్పించిన సిపిఎం నాయకులు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం మండల కేంద్రం కొల్లూరు సంజీవ్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం కొల్లూరు మండల కార్యదర్శి వేములపల్లి వెంకటరామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని తెలిపారు.