అత్తింటి వేధింపులు.. గర్భిణీ బలవన్మరణం

18835చూసినవారు
అత్తింటి వేధింపులు.. గర్భిణీ బలవన్మరణం
కడుపులో ఉన్న ఆడబిడ్డను చంపుకోలేక ఓ గర్భిణీ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగింది. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన కావ్యశ్రీ (19)కి రెండేళ్ల క్రితం సందు శ్రీకాంత్ (31)తో వివాహం జరిగింది. మొదట ఆడబిడ్డకు జన్మనిచ్చిన కావ్యశ్రీ.. ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. భర్త శ్రీకాంత్.. కావ్యశ్రీకి స్కానింగ్ చేయించగా.. ఆడబిడ్డ పుడుతుందని తెలిసింది. దాంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. అబార్షన్ చేయించుకోమని చెప్పడంతో మనస్థాపానికి గురైన కావ్యశ్రీ ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత పోస్ట్