ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ని అత్యున్నతంగా నిర్మించేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలు వస్తే అమరావతి మునిగిపోతుందంటూ ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా పక్కా ప్లాన్ రెడీ చేసింది. మూడు కాల్వలను సైతం డిజైన్ చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా రాజధాని నిర్మాణం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.