విశాఖలో భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు

69చూసినవారు
విశాఖలో భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు
అల్పపీడన ప్రభావంతో ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వానలతో రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. వరద ఉద్ధృతికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల రహదారులు చెరువుల్లా మారాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల పలుచోట్ల వృక్షాలు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షంతో జనజీవనం అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్