అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కడప, అన్నమయ్య, ఉభయ గోదావరి, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. భీమిలి, బద్వేల్, అనకాపల్లి, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. విశాఖలోని గోపాలపట్నం ఇందిరానగర్‌లోని కొండవాలు ప్రాంతంలో ప్రహారి గోడ కూలింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.