హైదరాబాద్ శివారులో రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 28న రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఈ టెర్మినల్‌లో దాదాపు 10 ప్లాట్‌ఫాంలు ఉండగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడి నుంచే మొదలు కానున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఈ టెర్మినల్‌ను నిర్మించింది.