AP: నల్లమల అటవీ ప్రాంతంలో 15 మంది భక్తులు దారి తప్పారు. ఇష్టకామేశ్వరీ దేవి ఆలయానికి వెళ్తూ అడవిలో తప్పిపోయారు. దీంతో భక్తులు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎర్రగొండపాలెం మండలం నెక్కంటి వద్ద నల్లమల అడవిలో భక్తులు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. భక్తులంతా బాపట్ల జిల్లా రేపల్లె మండలం మంత్రిపాలెం వారిగా తెలుస్తోంది.